Video

Karnataka Govt. Cancels Minority Reservations | Moves Into EWS Quota | Announces CM Basavaraj Bommai



కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి… దాన్ని 2 అగ్రకులాలకు కట్టబెడుతున్నట్లు ప్రకటించింది. OBC కేటగిరీలో 2B వర్గీకరణ కింద ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను సమానంగా విభజించి… వొక్కలిగాలు, లింగాయత్ లకు ఉన్న ప్రస్తుత కోటాకు జతచేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రిజర్వేషన్లు తొలగించిన మైనారిటీలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు-EWS కిందికి తీసుకువస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఉన్న EWS కోటాలోకి మైనారిటీలను తీసుకువస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుందని భేటీ తర్వాత సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ నిర్ణయంతో రిజర్వేషన్లు వొక్కలిగలకు 4 శాతం నుంచి 6 శాతానికి… లింగాయత్ లకు 5 నుంచి 7 శాతానికి పెరగనున్నట్లు తెలిపారు. ముస్లింల కోటాను రద్దు నిర్ణయాన్ని సమర్థించిన బొమ్మై.., మైనారిటీలకు రాజ్యాంగపరమైన నిబంధనలు లేవని స్పష్టం చేశారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

source